సీఎం జగన్‌ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ

సీఎం జగన్‌ బస్సు యాత్ర ఖరారు ..  మార్చి 27న ప్రొద్దుటూరులో సభ

ఏపీలో ఎన్నికల ప్రచారానిరకి  సీఎం జగన్ రెడీ అయిపోయారు.  మార్చి 27వ తేదీ నుంచి మేమంతా సిద్దం పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోననున్నారు.  ఇడుపులపాయ నుండే వైఎస్ జగన్ బస్సుయాత్ర మొదలు కానుంది. బస్సు యాత్ర కంటే ముందు  ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ని జగన్ సందర్శించనున్నారు. దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్రను మొదలుపెడతారు. 

అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది.  ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు.  లక్ష మంది ఈ సభకు హాజరు కావొచ్చని వైసీపీ అంచనా వేస్తోంది. ఇక మార్చి 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో మేమంతా బస్సు యాత్ర కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

సిద్దం సభలు జరిగిన చోట్ల బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉండనున్నాయి .జగన్  బస్సు యాత్ర ప్రకటన క్రమంలో వైసీపీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో  175 స్థానాలే లక్ష్యంగా జగన్  బరిలోకి దిగుతున్నారు.  ఇప్పటికే ఒకే విడతలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానలకు జగన్ అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో  బీజేపీ,టీడీపీ,జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.