జాగ్రత్తగా ఉండండి : రాష్ట్రంలో ఒక్కరికే కరోనా సోకింది

జాగ్రత్తగా ఉండండి : రాష్ట్రంలో ఒక్కరికే కరోనా సోకింది

కరోనా పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కరోనా పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. వైరస్ సోకకుండా ఇప్పటికే అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఒక్కరికే కరోనా వైరస్ సోకింది

రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 అనుమానాస్పద కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని అందులో 1మాత్రమే పాజిటీవ్ గా వచ్చిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా  కరోనావైరస్ టెస్ట్ లు చేసేందుకు 52ల్యాబ్ లు ఉన్నాయని..అందులో రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర సహకారంతో కాకినాడలో మరో ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

ఇంటింటికి కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు

గ్రామవాలంటీర్ల సహకారంతో ప్రతీ ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు చెబుతున్నట్లు జగన్ చెప్పారు. కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరు ఉన్నారనే సమాచారాన్నిసేకరించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డ్ లు

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఐసోలేషన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ముఖ్యమంత్రి ..నెల్లూరులో ఒకరికి కరోనా సోకిందని అన్నారు.  కరోనా సోకిన వ్యక్తి ఇంటి ప్రాంతంలో సుమారు 20,000వేల ఇళ్లలో సర్వేలు చేసి, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరాతీసినట్లు ముఖ్యమంత్రి జగన్  చెప్పారు.