ఐదేళ్లలో రూ.50 లక్షలు సంపాదించడం ఈజీ.. ఎంత SIP చేస్తే రీచ్ కావచ్చు.. కాంపౌండింగ్ లాభాలు ఎలా ఉంటాయంటే..

ఐదేళ్లలో రూ.50 లక్షలు సంపాదించడం ఈజీ.. ఎంత SIP చేస్తే రీచ్ కావచ్చు.. కాంపౌండింగ్ లాభాలు ఎలా ఉంటాయంటే..

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడం పెరుగుతోంది. ఇన్వెస్టర్లు తమ సంపద పెంచుకోవాలనుకుంటే ఇదే ఈజీ మార్గం కూడా. క్రమ శిక్షణతో, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొంత ఫిక్స్డ్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇన్వెస్ట్ చేస్తే, లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంపదను క్రియేట్ చేసుకోవచ్చని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా మీ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుకుంటూ పోవచ్చు. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడినా, ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

ఐదేళ్లలో  రూ.50 లక్షల కార్పస్ (మొత్తం పెట్టుబడి)ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం..
మంత్లీ సిప్  అమౌంట్

మీడియం నుంచి లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంపద క్రియేట్ చేయాలంటే ఈక్విటీ మ్యూచువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పండ్స్ మంచి ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నెల నెల కట్టే సిప్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనం ఎంత రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంచనావేస్తున్నామో  ఆధారంగా లెక్కించాలి.  

  •  ఉదాహరణకు,  ఏడాదికి 12 శాతం  రిటర్న్ (సగటు ఈక్విటీ ఫండ్ రిటర్న్) వస్తుందని అనుకుంటే,  ప్రతి నెల రూ.61 వేలు సిప్ చేయాల్సి ఉంటుంది.  ఐదేళ్లలో మీ మొత్తం ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విలువ రూ. 50 లక్షలకు చేరుతుంది. 
  • 10 శాతం లాభం వస్తుందని అనుకుంటే (రిస్క్ ఎక్కువగా తీసుకోని వాళ్లకు),   మంత్లీ సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమౌంట్ రూ.65 వేలకు పెరుగుతుంది.
  • 15 శాతం యాన్యువల్ రిటర్న్ (మార్కెట్ బాగా పెరుగుతుందని అంచనా వేసినప్పుడు) వస్తుందని అనుకుంటే,   నెలకు రూ.56 వేలు సిప్ చేయాలి. మొత్తంగా ఐదేళ్లలో రూ.50 లక్షలకు పెట్టుబడిని పెంచుకోవాలనుకుంటే నెల నెల రూ.56 వేల నుంచి రూ.65 వేల మధ్య సిప్ చేస్తే సరిపోతుంది. 

సిప్ ఎందుకంటే?

సంపద పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నా, సిప్   ద్వారా ఇన్వెస్ట్ చేయడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని  ఎనలిస్టులు చెబుతున్నారు. సిప్ చేసేటప్పుడు  మ్యూచువల్ ఫండ్ యూనిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేరు వేరు ధరల దగ్గర కొంటారు. దీంతో ప్రైస్  యావరేజ్ అవుతుంది. రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. సిప్ ద్వారా పొదుపు చేయడానికి అలవాటు పడతారు.   ఎడ్యుకేషన్, ఇల్లు కొనడం లేదా పెట్టుబడిని రూ.50 లక్షలకు పెంచుకోవడం వంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.   సిప్ ద్వారా మీకొచ్చిన రిటర్న్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మళ్లీ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయి. ఐదేళ్లలో కూడా కాంపౌండింగ్ ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించొచ్చు. 

సిప్ అమౌంట్ పెంచుకోవచ్చు.. స్తోమత ఉంటే సిప్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  పెంచుకోవచ్చు. దీనిని స్టెప్-అప్ సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటారు. తక్కువ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్టార్ట్ చేసిన వారు, తమ ఆర్థిక పరిస్థితులు మెరుగైతే సిప్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నెమ్మదిగా పెంచుకోవచ్చు. దీంతో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొందరగా చేరుకోచ్చు.  చిన్న అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అయినా ఎర్లీగా స్టార్ట్ చేయడం,  సేవ్ చేసి ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కంటే బెటర్.

ఫండ్ ఎంచుకునేటప్పుడు ఇవి ఫాలో అవ్వండి..

షార్ట్-టెర్మ్ ట్రెండ్స్ వెంట పడకూడదు. లాంగ్-టర్మ్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టాలి. నిలకడగా రిటర్న్ ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెన్స్ రేషియో, రిస్క్ ప్రొఫైల్ బట్టి ఫండ్స్ సెలెక్ట్ చేయాలి.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలిక్యులేటర్ ఉపయోగించి వేర్వేరు రిటర్న్ అంచనాల దగ్గర మంత్లీ ఎంత ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలో లెక్కించాలి.  

అందరూ నెలకు రూ.6‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 వేలకు పైగా ఇన్వెస్ట్ చేయలేరు. అప్పుడు ఇన్వెస్ట్ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవాలి. 7 లేదా 10 ఏళ్లకు  వరకు ఇన్వెస్ట్ చేస్తే, అప్పుడు మంత్లీ సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమౌంట్ బాగా తగ్గుతుంది. ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే, కాంపౌండింగ్ ద్వారా రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతుంది.