
గ్రామాల్లోని చివరి ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మిస్తేనే మిషన్ భగీరథ పథకం కంప్లీట్ అయినట్టని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. అన్ని గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతు న్నందునే ఎండాకాలంలో తాగునీటి ఇబ్బంది రాలేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ అవసరం రాలేద న్నారు. 55 లక్షల ఇళ్లకు భగీరథ నీళ్లు ఇస్తున్నా మని, పథకం అమలు తీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తితో ఉన్నారని చెప్పా రు. పథకం అమలుపై శనివారం ఎర్రమంజిల్‌లోని భగీరథ హెడ్ క్వార్టర్స్‌లో సమీక్షించారు. ఓవర్ హెడ్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాల న్నారు. ట్యాంకుల నిర్మాణం ఆలస్యమవుతున్న ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డిని ఆదేశించారు. గురుకులాలు, హాస్టళ్లు, డబుల్ బెడ్రూం కాలనీలకు భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.