ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య..అసలేం జరిగింది.?

ఆదిలాబాద్ రిమ్స్ లో  వైద్య విద్యార్థి ఆత్మహత్య..అసలేం జరిగింది.?

ఆదిలాబాద్ రిమ్స్  మెడికల్  కళాశాలలో దారుణం జరిగింది. జులై 30న ఉదయం విద్యార్థి  సాహిల్ హాస్టల్ గదిలో  ఉరివేసుకుని  అత్మహత్య చేసుకున్నాడు.

 రాజస్థాన్ లోని జైపూర్ కి  చెందిన సాహిల్ (19) రిమ్స్ మెడికల్ కాలేజీలో  ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఏమైందో ఏమో  జులై 30న ఉదయం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు  ఉరేసుకున్నాడు. గది తలుపులు  తీయకపోవడంతో  అనుమానం వచ్చిన హాస్టల్ నిర్వాహకులు, స్నేహితులు  డోర్ ను బద్దలు కొట్టి చూసే సరికి సాహిల్ ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. హుటాహుటిన సాహిల్ ను స్థానిక రిమ్స్  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సాహిల్ చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు.

►ALSO READ | కీటకాలను తినే అరుదైన మొక్కలు .. తెలంగాణలో ఎక్కడ ఉన్నాయంటే.?

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహిల్ ఆత్మహత్యకు గల కారణాలను తోటి విద్యార్థులను, కాలేజీలో అడిగి తెలుసుకుంటున్నారు. వేధింపుల కారణంగా ఉరేసుకున్నాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.