సంక్రాంతికి 6 వేల431 ప్రత్యేక బస్సులు: టీజీఎస్ ఆర్టీసీ

సంక్రాంతికి 6 వేల431 ప్రత్యేక బస్సులు: టీజీఎస్ ఆర్టీసీ
  • 50శాతం అదనపు చార్జీలు
  • ఆర్టీసీ యాజమాన్యం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులను నడుపనుందని ఆ సంస్థ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు, తిరిగి డౌన్​లో 18, 19 తేదీల్లో ఈ బస్సులను నడపనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులపై మాత్రమే 50% అదనపు చార్జీలు వసూలు చేస్తామని, రెగ్యులర్ బస్సులకు పాత చార్జీలే వర్తిస్తాయ ని తెలిపారు.

 పల్లె వెలుగు, ఎక్స్‌‌‌‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్​లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌‌బీ, బోయిన్​పల్లి, గచ్చిబౌలి నుంచి జిల్లాలు, రాష్ట్రాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in​లో బుక్ చేసుకోవాలన్నారు. వివరాలకు 040–69440000, 040– 23450033కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.