హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఆదివాసీ రాష్ట్ర చైర్మన్ గా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం గాంధీభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. పీసీసీ మీటింగ్ అనంతరం ఆయన బాధ్యతలు తీసుకోవడంతో అందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు శంకర్ నాయక్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
అనంతరం శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ఆదివాసీల సంక్షేమం, వారి హక్కుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. ఈ పదవిలో తనను నియమించిన కాంగ్రెస్ అగ్ర నేతలు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నేతలకు శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
