మల్కాజిగిరిలో రూ.2 కోట్ల విలువ గల ఫోన్లు రికవరీ

మల్కాజిగిరిలో  రూ.2 కోట్ల విలువ గల ఫోన్లు రికవరీ
  • బాధితులకు 1,039 ఫోన్లు అప్పగించిన మల్కాజిగిరి పోలీసులు 

మల్కాజిగిరి, వెలుగు: ఇటీవల మల్కాజిరిగి, ఎల్బీనగర్​ప్రాంతాల్లో చోరీకి గురైన, పలువురు పోగొట్టుకున్న 1,039 ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ గుణశేఖర్​తెలిపారు. గురువారం మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఫోన్ల విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని చెప్పారు. 

అనంతరం 30 మంది బాధితులకు ఫోన్లు అప్పగించారు. మిగతా వారికి సమాచారం ఇచ్చామన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 4,733 ఫోన్లు రికవరీ చేశామని పేర్కొన్నారు. డీసీపీ రామేశ్వర్, అడిషనల్​డీసీపీ కరుణాసాగర్ తెలిపారు.