మెదక్ టౌన్, వెలుగు: డిజిటల్కార్డ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని సీఎంవో స్పెషల్ఆఫీసర్ సంగీత అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మెదక్ మున్సిపాలిటీలోని 20వ వార్డులో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల వివరాలను సేకరించి సరైన విధంగా నమోదు చేయాలని సూచించారు.
కొన్నిచోట్ల సర్వే తుది దశకు చేరుకుందని, వివరాలు పక్కాగా నమోదయ్యాయా లేదా అని చెక్చేసుకోవాలన్నారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఈ డిస్టిక్ మేనేజర్ సందీప్ ఉన్నారు.
ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు
పుల్కల్: ప్రతి కుటుంబానికీ డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పైలెట్ప్రాజెక్ట్గా నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి సర్వే చేస్తుందని కలెక్టర్ క్రాంతి అన్నారు. శనివారం పుల్కల్ మండలంలోని ఇసోజీపేటలో చేపట్టిన సర్వేను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామన్నారు.
తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు ఇద్దరు అధికారుల బృందం గ్రామాల్లో సర్వే చేస్తుందన్నారు. ఈ నెల 3 నుంచి 7 వరకు సర్వే పనులు కొనసాగుతాయని, ఈ సర్వే ద్వారా ప్రతీ కుటుంబం ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. ఆమె వెంట డీపీవో సాయిబాబా, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో అనందమేరీ, ఎంపీవో శ్రీకాంత్ ఉన్నారు.