నవంబర్ 28 నుంచి కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు

నవంబర్ 28 నుంచి  కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు
  • దేశంలోని 8 బొగ్గు కంపెనీల క్రీడాకారులు రాక
  • కొత్తగూడెంలో మూడు రోజుల పాటు  నిర్వహణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్​ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు కొత్తగూడెంలో శుక్రవారం షురూ ​కానున్నాయి. కోల్​ఇండియా ఇంటర్​కంపెనీ లెవల్​కబడ్డీ పోటీలు ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు నిర్వహిస్తారు.  కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లోని జయశంకర్​ గ్రౌండ్​లో పోటీలు జరగనున్నాయి. సింగరేణితో పాటు బీసీసీఎస్​, సీసీఎల్, ఈసీఎల్, ఎంసీఎల్, ఎన్​సీఎల్, ఎస్​ఈసీఎల్, డబ్ల్యూసీఎల్ కంపెనీల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. 

దేశం లోని పలు బొగ్గు పరిశ్రమల నుంచి కార్మిక క్రీడాకారులు తరలివస్తుండడంతో అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లడ్​ లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించేందుకు కబడ్డీ కోర్టులు సిద్ధమయ్యాయి .రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కలిగిన అంపైర్లను ఆహ్వానిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలను సింగరేణి అధికారులు కల్పిస్తున్నారు.