
న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ కోల్ ఇండియా (సీఐఎల్) ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో రూ.9,604.02 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ. 8,572.14 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.40,457.59 కోట్ల నుంచి రూ.41,761.76 కోట్లకు చేరుకుంది.
క్యూ4లో కోల్ ఇండియా మొత్తం ఖర్చులు రూ.29,057.30 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కోల్ ఇండియా 6.21 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో 78.11 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.