- కేకే ఓసీపీలోని సీహెచ్‌పీని మహిళా ఉద్యోగులతో నడిపిస్తం
- ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓసీపీలో అప్లోడింగ్పనుల ప్రారంభంతో బొగ్గు ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ తెలిపారు. సోమవారం జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవంబర్‌లో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. నవంబర్‌లో 2,57,500 టన్నులకు గాను 1,75,769 టన్నుల ఉత్పత్తి (68 శాతం) సాధించినట్లు తెలిపారు. 33 గూడ్స్ రైళ్ల ద్వారా 1,62,222 టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు చెప్పారు.
కేకే5 గనిలో 93 శాతం, కాసిపేట2 గనిలో 78శాతం, కేకే ఓసీపీలో 68శాతం, కాసిపేటలో 63శాతం,శాంతిఖనిలో 14శాతం బొగ్గు ఉత్పత్తి వచ్చిందన్నారు. ఇటీవల కేకే ఓసీపీ ఆవరణలో నిర్మించిన ఓబీ మట్టి నుంచి ఇసుక తయారీ చేసే పీవోబీ ప్లాంట్‌నుంచి ఇసుకను కాసిపేట1 సాండ్స్ట్రవింగ్కు సప్లై అవుతోందని, ఫలితంగా గనిలో బొగ్గు ఉత్పత్తి నిరాంతరయంగా జరుగుతోందన్నారు. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఫేజ్2 విస్తరణ కోసం డిసెంబర్3న పబ్లిక్ హియరింగ్నిర్వహిస్తున్నామని, రాజకీయ, కార్మికసంఘాలు, స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.
మందమర్రి ఏరియా కేకే ఓసీపీలోని కోల్హ్యాండ్లింగ్ప్లాంట్జనరల్ షిఫ్ట్‌ను పూర్తిగా మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో నడిపించనున్నట్లు జీఎం తెలిపారు. త్వరలో అండర్ మేనేజర్, ఇంజనీర్, ఇద్దరు సూపర్వైజర్లు కేటాయించి సీహెచ్‌పీని నడిపిస్తామన్నారు. సమావేశంలో ఏరియా ఏస్వోటుజీఎం జీఎల్ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ భగవతి బాలాజీ ఝూ, డీజీఎం (పర్సనల్) అశోక్, ఐఈడీ ఎస్ఈ కిరణ్‌కుమార్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డీవైపీఎం శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
