ఇవాళ మహా శివరాత్రి.. పరమ శివుడికి ఇష్టమైన రోజు. అయితే శివుడి మెడలో నాగుపాము ఉంటుంది. మనం ఏ శివాలయంలో చూసిన ఆ పరమేశ్వరుడు మనకు మెడలో పాముతోనే కనిపిస్తాడు. అయితే శివరాత్రి రోజున... త్రాచుపాము ఓ ఇంటి ముందు హల్ చల్ చేసింది. పడగ విప్పి నాట్యం చేసింది. అయితే ఆ ఇంటికి సమీపంలోనే... శివాలయం, ముత్యాలమ్మ గుడి ఉండటంంతో నాగేంద్రుడే తమ ఇంటికి వచ్చాడంటూ... స్థానికులు శివుడ్ని ప్రార్థించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం లోని ముంగిమడుగు గ్రామం లో చోటు చేసుకుంది. సుధగని సాయి అనే వ్యక్తి ఇంటిముందు ఓ త్రాచుపాము హల్చల్ చేసింది. పడిగవిప్పి నాట్యం చేసింది దీంతో కాసేపు అక్కడ ఉన్న వారు భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం త్రాచుపాము పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే సాయి ఇంటి సమీపంలో శివాలయం ఉండడంతో నాగేంద్రుడు వచ్చాడని స్థానిక ప్రజలు పరమ శివుడికి పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి:
