కరోనాపై పోరుకు కోకాకోలా రూ.100 కోట్ల సాయం

కరోనాపై పోరుకు కోకాకోలా రూ.100 కోట్ల సాయం

భారత్ లో కరోనా వైరస్‌ ‌పై జరుగుతున్న పోరులో ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ సంస్థ కోకాకోలా కూడా తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. వంద కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించింది. ఈ డబ్బును ఆరోగ్య సంరక్షణ, పేదల సాయానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఏజంట్ల ద్వారా 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో అవసరమైన వారికి పానీయాలను కూడా సరఫరా చేస్తామని ప్రకటించింది.

కోకాకోలా ఫౌండేషన్, అట్లాంటా మద్దతుతో యునైటెడ్ వే, కేర్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నామని, లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, వలస కూలీలకు ఆహారం, పానీయాలు అందించనున్నట్టు తెలిపింది. భారత్‌లో తాము ప్రారంభించిన ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ తెలిపింది.