హైదరాబాద్, వెలుగు: మేడారం జాతర సందర్భంగా స్థానిక వ్యాపారులకు సేవలను అందించామని కోకా కోలా ఇండియా, హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపాయి. లోకల్లీ యువర్స్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రిటైలర్లకు, వ్యాపారులకు కూలింగ్ మౌలిక సదుపాయాలు కల్పించాయి. ఆర్థికంగా తోడ్పాటు అందించాయి. భక్తుల దాహం తీర్చడానికి మొబైల్ హైడ్రేషన్ కార్లు, తాత్కాలిక స్టాళ్లు, విశ్రాంతి గదులను ఏర్పాటు చేశాయి.
మైదాన్ సాఫ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ పై దృష్టి సారించాయి. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి బెంచీలను, మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను నిర్మించామని హెచ్‌సీసీబీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినయ్ వివరించారు.
