బొద్దింక ర్యాంప్ వాక్.. మెట్ గాలా ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్

బొద్దింక ర్యాంప్ వాక్.. మెట్ గాలా ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్

ఐకానిక్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023  మే 1న న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా  ఫ్యాషన్ వరల్డ్ కి సంబంధించిన ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇండియా నుండి పలు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. వరల్డ్ క్లాస్ టాప్ సెలబ్రెటీస్ అంతా తమ తమ అద్బుతమైన అవుట్ ఫిట్స్ తో చూపరులకు కనువిందు చేశారు.

కోట్లు విలువ చేసే దుస్తువులు దరించి ర్యాంప్ వాక్ చేస్తూ  కెమెరాలకు పోజులియిచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా పాల్గొంది. కళ్ళు మీరిమిట్లు గొలిపే తెల్ల రంగు గౌన్ దరించిన ఆమె.. ఈ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆలియా వేసుకున్న గౌన్ కి ప్రముఖుల నుండి ప్రశంసలు కూడా దక్కాయి. ప్రస్తుతం ఆలియాకి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టినట వైరల్ రా మారాయి.

ఇక అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ లో అనుకోని అతిది వచ్చి అదరిని ఆశ్చర్య పరిచింది. ఆ గెస్ట్ మరెవరో కాదు బొద్దింక. అవును.. అందగత్తెలు అంతా ర్యాప్ వాక్ చేస్తుంటే.. నాకేం తక్కువ అనుకుందో ఏమో.. వేంటనే స్టేజ్ పైకి వచ్చేసింది. ర్యాంప్ వాక్ చేస్తున్న వారి వెనకాలే నడుస్తూ హొయలుపోయింది. ప్రస్తుతం బొద్దింక చేసిన ఈ ర్యాంప్ వాక్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.