సోషల్ మీడియా సంచలనం.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనకు సిద్ధమైంది. ప్రకటించినట్లుగానే 2026 జూన్ 06వ తేదీన ఢిల్లీలోన జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని ఆ పార్టీ చెప్తోంది. అయితే ఆ పార్టీ తలపెట్టిన సమావేశానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. పర్మిషన్ లేకుండా జనసమీకరణ చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు తగ్గేదే లేదంటున్న సీజేపీ, మరోవైపు అనుమతి లేకుండా వస్తే చర్యలు తప్పవు అంటున్న పోలీసులు.. దీంతో ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
దేశ రాజకీయాలపై సెటైరికల్ గా మొదలైన ఆన్ లైన్ పార్టీ.. ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లతో ఒక ప్రకంపనలు తెస్తుందా అన్నంతలా దూసుకుపోతోంది. ఆన్ లైన్ ఉద్యమం కాస్త ఆఫ్ లైన్ గా మారేందుకు జూన్ 6ను ముహూర్తంగా పెట్టుకుంది పార్టీ. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన తెలుపుతామని అంటున్నారు. పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఈ కార్యక్రమం కోసం ఇండియా రానున్నారు.
అభిజీత్ వచ్చాక అనుమతి కోసం అప్లై చేసుకుంటామని పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆయన ఆధ్యర్యంలో శాంతియుత ప్రదర్శన చేస్తామని ప్రకటించారు. పోలీసులు దీనికి అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీప్కే తో పాటు ఢిల్లీ పోలీసులను కలిసి అనుమతి తీసుకోనున్నట్లు సీజేపీ స్పోక్స్ పర్సన్ అశుతోశ్ రంకా చెప్పారు.
నీట్ పేపర్ లీకేజ్ తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జరిగే ప్రదర్శనలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుమతి లభించడం కష్టంగానే అనుకుంటుటున్నారు. రేపు జరగబోయే ప్రదర్శనపై ప్ర్యత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు చెప్పారు.
అభిజీత్ దీప్కే వీడియో:
సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే.. తను ఇండియా వస్తున్న క్రమంలో.. పార్టీ మద్ధతు దారులంతా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రావాల్సిన అవసరం లేదని వీడియోలో పేర్కొన్నారు. అందరూ ఎయిర్ పోర్టుకు వస్తే అసౌకర్యంగా ఉంటుందని.. ప్రజలను అసౌకర్యం కల్పించకుండా.. అందరూ జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఢిల్లీ రాగానే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి శాంతి యుత ఆందోళనకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరనున్నట్లు చెప్పారు. ప్రదర్శన, ఆందోళన శాంతియుతంగా ఉండాలని కోరారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరినవాళ్లంతా ప్రదర్శనల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
Important Update:
— Cockroach is Back (@Cockroachisback) June 4, 2026
The overwhelming response from those who want the resignation of Dharmendra Pradhan to our call to join us at Delhi Airport was beyond our imagination.
It is not feasible for so many people to assemble at the airport as it would cause inconvenience to the… pic.twitter.com/VOkd0Fbjmv
