కాక్‌‌‌‌టెయిల్‌‌‌‌ 2 ఫస్ట్ లుక్ టీజర్‌‌‌‌ రిలీజ్.. ఆకట్టుకున్న కృతి, రష్మిక, షాహిద్ కెమిస్ట్రీ

కాక్‌‌‌‌టెయిల్‌‌‌‌ 2  ఫస్ట్ లుక్ టీజర్‌‌‌‌ రిలీజ్.. ఆకట్టుకున్న కృతి, రష్మిక, షాహిద్ కెమిస్ట్రీ

బాలీవుడ్‌‌‌‌లో భారీ యాక్షన్‌‌‌‌ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని రొమాంటిక్‌‌‌‌ లవ్ స్టోరీస్‌‌‌‌ వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. వాటికి సీక్వెల్స్‌‌‌‌ రావడం కూడా ఎక్కువే. తాజాగా ఈ వరుసలో ‘కాక్‌‌‌‌టెయిల్‌‌‌‌ 2’ వస్తోంది. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ లీడ్ రోల్స్​లో నటించిన సూపర్ హిట్ మూవీ ‘కాక్‌‌‌‌టెయిల్’కు ఇది సీక్వెల్‌‌‌‌. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌‌‌‌లో నటించారు.

 ఫ్రెండ్‌‌‌‌ షిఫ్‌‌‌‌, లవ్, మ్యాడ్‌‌‌‌నెస్‌‌‌‌ కలయికలో ఉండబోతోంది. హోమీ అదాజానియా దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయి రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతున్నందున ప్రమోషన్స్‌‌‌‌లో స్పీడు పెంచారు. బుధవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ ‘జబ్ తలక్’ ఫస్ట్ లుక్ టీజర్‌‌‌‌ను విడుద‌‌‌‌ల చేశారు. సమ్మర్ వెకేషన్, రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగిన ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేయగా, అరిజిత్ సింగ్, అకాసా పాడారు.

అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాశారు. పార్టీ మూడ్‌‌‌‌ను ప్రజెంట్ చేస్తూ చిత్రీకరించిన ఈ పాటలో కృతి సనన్, రష్మిక గ్లామర్‌‌‌‌‌‌‌‌తో పాటు షాహిద్ ఎనర్జిటిక్ డాన్స్‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌ ఇంప్రెస్ చేశాయి. ఈ పాటతో ఈ సమ్మర్‌‌‌‌‌‌‌‌ మరింత హాట్‌‌‌‌గా ఉండబోతోందని పాట ప్రారంభంలో స్వీట్ వార్నింగ్‌‌‌‌ ఇచ్చారు.  జూన్ 19న సినిమా విడుదల కానుంది.