
- 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న కాగ్నిజెంట్
న్యూఢిల్లీ: యూఎస్ఐటీ కంపెనీ కాగ్నిజెంట్, ప్రస్తుత సంవత్సరంలో ఇండియా ఆఫీసుల కోసం 20వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని తెలిపింది. ఏఐ- ఆధారిత సాఫ్ట్‌వేర్ల అభివృద్ధికి కోసం వీరిని తీసుకుంటామని తెలిపింది. గత క్వార్టర్లో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300కు చేరిందని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ అన్నారు.
ప్రాజెక్టులు పెరిగినందున మరింత మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోందని కుమార్ అన్నారు. తమ సంస్థలో14 వేల మంది మాజీ ఉద్యోగులు తిరిగి చేరారని, మరో 10 వేల మంది చేరే అవకాశం ఉందని వివరించారు. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ 2025 జనవరి–-మార్చి క్వార్టర్లో 5.1 బిలియన్డాలర్ల ఆదాయం సంపాదింది. ఈ మొత్తం ఏడాది లెక్కన 7.45 శాతం పెరిగింది.