భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

రాష్ట్రం చలితో గజగజ వణుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోయాయి. పలుచోట్ల ఉదయం 8 వరకు మంచు కురుస్తోంది. అడుగు దూరంలో ఉన్నవాళ్లు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు పడుతోంది. రాత్రి పూట సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మినిమం టెంపరేచర్స్ తగ్గాయి. సాయంత్రం ఐదింటి నుంచే చలి మొదలవుతోంది. ఉదయం 9 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. చలి గాలుల వల్ల ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే వణుకుతున్నారు. చలి తీవ్రత మరో నాలుగైదు రోజులు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో.. రాత్రి టెంపరేచర్లు 5 రోజులపాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తగ్గవచ్చిన అధికారులు తెలిపారు. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం చలి బాగా పెరిగింది. గత 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 7.1 డిగ్రీలు, జహీరాబాద్ లో 7.3 డిగ్రీలు, వికారాబాద్ లో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదయ్యాయి.