చలి వణికిస్తోంది..పొగముంచు కమ్మేస్తోంది. 

చలి వణికిస్తోంది..పొగముంచు కమ్మేస్తోంది. 

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది.  తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ఉదయం 9 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం వల్ల కొన్ని ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అన్ని ఊర్లలో చలి గాలులు వీస్తున్నాయి. మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో ప్రజలు పగలు, రాత్రి తేడా లేకుండా చలి మంటలు వేసుకుంటున్నారు. 24 గంటలూ స్వెటర్లు, మప్లర్లు ధరించి కనిపిస్తున్నారు. ఉదయం పూట చలి ఎక్కువ ఉండటంతో కొన్ని చోట్ల యోగా సెంటర్లు, 
జిమ్​లు, పార్కులు ఉదయం పూట ఖాళీగా కనిపిస్తున్నాయి. 

తగ్గిన ఉష్ణోగ్రతలు.. 
 
మరో 10 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో గత 10 రోజులుగా కనిష్టం 9 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కిందటి నవంబర్​ లో రికార్డు స్థాయిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్, డిసెంబర్​లో సగటున 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 4 నుంచి 7 గంటల వరకు పొగమంచు కురుస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నా రు. సాయంత్రం 6 దాటగానే మళ్లీ చలి పెరుగు తోంది. ఈ చలివల్ల స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వెల్ఫేర్​ హాస్టళ్లలో విద్యార్థులకు కష్టంగా మారింది. చలికాలానికి తగ్గట్టు హాస్టళ్లలో సౌకర్యాలు లేవు. దీంతో చన్నీటి స్నానం, పలుచని దుప్పట్లతో విద్యార్థులు  తిప్పలు పడుతున్నారు. 

చలికి వణకుతున్నం 

ఉదయం పూట చలి తీవ్రంగా పెరుగుతోంది. 9 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వాకింగ్​ కు ఉదయం 8 గంటల తరువాత వెళ్తుతున్నాం. వ్యాయామం లేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తుల రేట్లు పెంచారు. 
- హన్మాండ్లు సాయినగర్​ వాసి

చలితో అవస్థలు పడుతున్నం 

చలి తీవ్రత రెట్టింపు కావడంతో అవస్థలు పడు తున్నం. పొగమంచుతో రోడ్లు కనిపిస్తలేవు. యాక్సిడెంట్స్​ భయంతో పది గంటల తరువాత డ్యూటీలకు వెళ్లాల్సి వస్తోంది. ఇంటిలోనే వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. 
- పవన్ గాయత్రినగర్​ వాసి