ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు ఆలస్యం

ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. పలు విమానాలు ఆలస్యం

ఢిల్లీని చలి వణికిస్తోంది.  నగరంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ణ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సీయస్ గా  నమోదయ్యింది. చలికి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు.  చలికి తట్టుకోలేక  చలిమంట కాచుకుంటున్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీలోని  ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

ఢిల్లీలో రాబోయే రెండు రోజులు  వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేగాకుండా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.