కొల్లాజెన్ కావాల్సిందే

కొల్లాజెన్ కావాల్సిందే

కొల్లాజెన్‌ అనేది ఒక ప్రొటీన్. శరీరంలోని ప్రొటీన్ మొత్తంలో మూడోవంతు ఉంటుంది ఇది. శరీరంలోని అన్ని కణాలు కలిసి పనిచేసేలా చేస్తుంది.  ఎముకలు, కీళ్లు, కండరాలు, కార్టిలేజ్‌ ఇలా శరీరంలో ఉన్న ప్రతి పార్ట్​లో కొల్లాజెన్ ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారాలన్నా కూడా కొల్లాజెన్ ప్రొటీన్ కావాల్సిందే. గ్లైసిన్, ప్రోలిన్, హైడ్రాక్సీ ప్రోలిన్, అర్జినైన్ అనే అమైనో యాసిడ్స్​తో కొల్లాజెన్ తయారవుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దాంతో కీళ్ల నొప్పులతో పాటు, చర్మం కూడా కాంతి కోల్పోతుంది. ముడతలు పడటం స్టార్ట్‌ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. మంచి డైట్‌ ఫాలో అయి కొల్లాజెన్ తగ్గకుండా చూసుకోవచ్చు.

అమైనో యాసిడ్స్‌ నుంచి కొల్లాజెన్‌ తయారవుతుంది. అయితే శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల అమైనో యాసిడ్స్‌ ఫుడ్‌ ద్వారానే దొరుకుతాయి. అందుకే ప్రొటీన్ ఎక్కువగా ఉండే మాంసం, గుడ్లు, చిక్కుళ్లు, పల్లీ, కాటేజ్‌ చీజ్, సోయా, చేపలు, పాల పదార్థాలు బాగా తినాలి.విటమిన్‌ – సి రోజూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందుకే బొప్పాయి,  ఆకు కూరలు, టొమాటో, బ్లూ బెర్రీ, ఆరెంజ్‌ ఎక్కువగా తినాలి. 

 కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేందుకు జింక్‌ సాయపడుతుంది. డ్యామేజ్ అయిన చర్మ కణాలను తిరిగి రిపేర్‌‌ చేస్తుంది. పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, జీడి పప్పులో జింక్ ఉంటుంది. వీటిని రోజూ తింటే చర్మం బాగుంటుంది. ప్రోలిన్ అమైనో యాసిడ్ తయారవడానికి మాంగనీస్ అవసరం. కొల్లాజెన్ శరీరంలో ఉన్న వేరొక కణాలతో కలవడానికి కాపర్ సాయపడుతుంది. ఇవి బ్రౌన్ రైస్‌, ఆకు కూరలు, బీన్స్‌, పప్పుల్లో ఉంటుంది.