
జీడిమెట్ల, వెలుగు : నిజాంపేట కార్పొరేషన్పరిధి ప్రగతినగర్ఎన్ఆర్ఐ కాలనీలో కుప్పకూలిన బిల్డింగ్‌ను టౌన్ ప్లానింగ్ అధికారులు గురువారం కూల్చివేశారు. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో టౌన్ప్లానింగ్అధికారుల బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టారు. అధికారుల ఫిర్యాదుతో బిల్డర్స్పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.