
సినిమా అభిమానులందరికీ గుడ్ న్యూస్. సెప్టెంబర్ 2025 నెల సినీ ప్రియులకు ఒక అద్భుతమైన విందు లాంటిది. ఈ నెలలో బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన చిత్రాల జాబితా చాలా పెద్దదిగా ఉంది. 'ఓజీ' నుంచి 'కేడీ: ది డెవిల్' వరకు, పలు దక్షిణాది సినిమాలు ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అఖండ 2, కాంతా లాంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
బిగ్ స్క్రీన్ పై సందడి చేయనున్న తెలుగు సినిమాలు
సెప్టెంబర్ నెలలో తెలుగు సినిమా అభిమానులకు గొప్ప ట్రీట్ లభించనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' (OG) సెప్టెంబర్ 25న విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అంతేకాకుండా, నటసింహం నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్ జంటగా నటించిన 'అఖండ 2' సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, అఖండ సినిమా కొనసాగింపు కాబట్టి ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు ఇది ఒక పెద్ద పండుగ.
దీనితో పాటు, చింతకింటి శ్రీనివాస్ రావు రచన, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క, విక్రమ్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ డ్రామా 'ఘాటీ' . ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఇక, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కాంతా' సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు.
దక్షిణాది సినిమా అభిమానులకు అదనపు వినోదం
తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల సినిమాలు కూడా ఈ నెలలో థియేటర్లను షేక్ చేయనున్నాయి. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రేమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'కేడీ: ది డెవిల్' సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ధృవ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి.రవిచంద్రన్, నోరా ఫతేహి వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. ఇది పాన్-ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలను సృష్టించింది. ప్రవీణ్ శెట్టి, షైన్ ఎస్ శెట్టి నటించిన 'నిద్రాదేవి నెక్ట్స్ డోర్' సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రెండు కన్నడ చిత్రాలు
మలయాళం
కొత్త దర్శకుడు వీరా తెరకెక్కించిన మలయాళ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం 'హాల్' సెప్టెంబర్ 12న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో షేన్ నిగమ్, సాక్షి విద్య ప్రధాన పాత్రల్లో నటించారు. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'కరమ్' కూడా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.
తమిళం:
వర్ష భరత్ దర్శకత్వంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన 'బ్యాడ్ గర్ల్' సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్ డామ్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించి మంచి పేరు సంపాదించుకుంది. ఇంకా, అతియన్ అతిరై దర్శకత్వం వహించిన 'తాండకారణ్యం' సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
మొత్తానికి ఈ సెప్టెంబర్ నెల దక్షిణాది సినిమా అభిమానులకు పండుగే అని చెప్పుకోవాలి. మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించనుందో చూడాలి.