
సుమారు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి మంచు లక్ష్మి (Manchu Lakshmi) సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'దక్ష (ది డెడ్లీ కాన్సిపరెసీ)' చిత్రం నుంచి లేటెస్ట్ గా ఉత్కంఠభరితమైన టీజర్ విడుదలైంది. మంచు లక్ష్మి ఈ సినిమాను వారి సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా డాక్టర్ మోహన్ బాబు, మంచు లక్ష్మి వ్యవహరిస్తున్నారు.
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్!
దర్శకుడు వంశీకృష్ణ మల్ల రూపొందించిన ఈ చిత్రం ఒక యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌లో మంచు లక్ష్మి ఒక పవర్ ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఆమె లుక్స్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో ఆమె తన విశ్వరూపం చూపించింది. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయని టీజర్ స్పష్టం చేస్తోంది.
పాత టైటిల్... కొత్త లుక్
మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని సుమారు నాలుగేళ్ల క్రితమే 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్‌తో ప్రకటించారు. అయితే, ఇప్పుడు అదే సినిమాను 'దక్ష'గా మార్చి విడుదల చేస్తున్నారు. ఈ మార్పుకు కారణం ఇంకా తెలియకపోయినా, కొత్త టైటిల్ సినిమా థీమ్‌కు బాగా నప్పుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
►ALSO READ | Pawan Kalyan : 'OG' నుంచి 'సువ్వి.. సువ్వి' సాంగ్ రిలీజ్.. మెలోడీతో అదరగొట్టిన తమన్ !
ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్ధిక్, ప్రముఖ నటులు సముద్రఖని, చైత్ర శుక్ల వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వీరే కాకుండా, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి దాదాపు పదేళ్ల తర్వాత విడుదల కానున్న చిత్రం ఇది. ఈ బ్యానర్ నుంచి చివరిసారిగా 2015లో 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం విడుదలైంది.
టీజర్‌తోనే అంచనాలు పెంచిన 'దక్ష' చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐదేళ్ల తర్వాత మంచు లక్ష్మి నటన ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.