కామారెడ్డిలో 31.93 సెంటీమీటర్ల వర్షపాతం..ఉప్పొంగిన వాగులు.. కొట్టుకుపోయిన కార్లు..

కామారెడ్డిలో  31.93 సెంటీమీటర్ల వర్షపాతం..ఉప్పొంగిన వాగులు.. కొట్టుకుపోయిన కార్లు..

 తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా్యి.రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు వంకలు పొంగిపోతున్నాయి .పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 26 రాత్రి నుంచి   ఆగస్టు 27 మధ్యాహ్నం 1 వరకు రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది.

ఉదయం 8.30 నుంచి 1 గంటల వరకు  కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం అర్గొండ లో 31.93 సెంటీమీటర్ల అత్యంత అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యింది.  మెదక్ లోని నాగపూర్ లో 20.88 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదయ్యింది.  కామారెడ్డి జిల్లాలోని బికనూరు లో 19.1 సెంటీమీటర్లు, పాత రాజంపేట్ లో 18.9 సెంటీమీటర్లు, దోమకొండ లో 16.5 సెంటీమీటర్లు , మెదక్ జిల్లాల్లో  రామాయంపేటలో 16 సెంటీమీటర్లు,  మెదక్ లోని మరో రెండు ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యింది. 

►ALSO READ | కామారెడ్డిలో కుండపోత వాన..వరదకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. పలు రైళ్లు రద్దు

 మరో వైపు  కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల‎కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.