రాజమౌళి మాస్టర్ ప్లాన్: రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా.. ఆసక్తిగా ‘బాహుబలి: ది ఎపిక్‌’ టీజ‌ర్

రాజమౌళి మాస్టర్ ప్లాన్: రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా.. ఆసక్తిగా ‘బాహుబలి: ది ఎపిక్‌’ టీజ‌ర్

తెలుగు సినిమాని పాన్‌‌ ఇండియా స్థాయిలో నిలబెట్టిన ఫస్ట్ మూవీ ‘బాహుబలి’. ప్రభాస్‌‌, రానా, అనుష్క లీడ్ రోల్స్‌‌లో రాజమౌళి తెరకెక్కించిన ఈ బ్లాక్బస్టర్‌‌‌‌ మూవీ ఇప్పుడు రీ రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. ఐదున్నర గంటల నిడివి గల బాహుబలి రెండు భాగాలను.. కలిపి ఒకే సినిమాగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్‌‌’ పేరుతో అక్టోబర్ 31న థియేటర్స్‌‌లో విడుదల కానుంది. 

ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్ట్ 26న) ‘బాహుబలి: ది ఎపిక్‌‌’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రీమాస్ట‌ర్‌డ్, రీ ఎడిట్ వెర్ష‌న్‌తో టీజర్ అంచనాలు పెంచింది. మరోసారి ఈ సింగిల్ ‘బాహుబలి’తో జక్కన్న మ్యాజిక్ చేయనున్నారనే విషయం తెలుస్తోంది. అయితే, లేటెస్ట్ సినిమాటిక్ అనుభవం కోసం కొత్త కట్స్ కూడా యాడ్ చేస్తున్నారట మేకర్స్. ఈ ప్రయత్నం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాగే, ఈ సినిమాను భారతదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 'అన్నను వెండితెరపై చూడటానికి రెడీగా ఉన్నామంటూ' సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : రజనీకాంత్, నాగ్ అశ్విన్ కాంబోలో భారీ ప్రాజెక్ట్..

ఇదిలా ఉంటే.. బాహుబలి ఫస్ట్ పార్ట్ జూలై 2015లో విడుదలైంది. సెకండ్ పార్ట్ ఏప్రిల్ 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "బాహుబలి: ది బిగినింగ్" ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది. "బాహుబలి 2: ది కంక్లూజన్" రూ.1788.06 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇలా అప్పట్లోనే రికార్డులు సృష్టించిన బాహుబలి, రీ రిలీజ్‌‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు SSMB29 మూవీతో రాజమౌళి బిజీగా ఉన్నారు.