రజనీకాంత్, నాగ్ అశ్విన్ కాంబోలో భారీ ప్రాజెక్ట్.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

రజనీకాంత్, నాగ్ అశ్విన్ కాంబోలో భారీ ప్రాజెక్ట్..  థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అత్యధిక వసూలు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. దీంతో అభిమానులు ఫుల్ కృషిలో ఉన్నారు. ఈ క్రమంలో యువ దర్శకుడు నాగ అశ్వీన్ తో రజనీకాంత్ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ కలిసి నటించిన చిత్రం 'కల్కి 2898 AD'.  బాక్సీఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీకి దర్శకత్వం వహించింది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్.  ఇప్పుడు రజనీకాంత్ కు డైరెక్ట్ చేసేందుకు అశ్వీన్ రెడీ  అవుతున్నారని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది.  నాగ్ అశ్విన్ కథ చెప్పగానే రజనీకాంత్ బాగా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. అంతే కాదు పూర్తి స్క్రీన్ ప్లే సిద్ధం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.. 

నిజంగా ఈ ప్రాజెక్టు గనుక కార్యరూపం దాల్చితే ..  చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ ఒక తెలుగు దర్శకుడితో పనిచేసినట్టు అవుతుంది. అంతేకాకుండా, లోకేష్ కనగరాజ్ వంటి అరుదైన దర్శకుల సరసన నాగ్ అశ్విన్ చేరుకుంటారు. ఎందుకంటే, లోకేష్ లాగే నాగ్ అశ్విన్ కూడా కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరినీ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుంటారు

ALSO READ : ఓటీటీల్లో టాప్ 5 వెబ్ సిరీస్లివే..

తెలుగు చిత్రసీమలో ప్రత్యేకమైన కథాశైలి, గొప్ప విజన్ ఉన్న దర్శకుడిగా నాగ్ అశ్విన్‌కు పేరుంది. 2015లో 'ఎవడే సుబ్రమణ్యం'తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత, 2018లో వచ్చిన 'మహానటి'తో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. దిగ్గజ నటి సావిత్రి జీవితంపై రూపొందించిన ఈ బయోపిక్ కమర్షియల్‌గా, విమర్శనాత్మకంగానూ పెద్ద విజయాన్ని సాధించింది. ఇక, 'కల్కి 2898 AD'తో భారతీయ సినిమాలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో కలిపి ఆయన చూపించిన తీరు అద్భుతం నిలిచి ప్రేక్షకులను మెప్పించింది.  

నాగ్ అశ్విన్, రజనీకాంత్ కాంబినేషన్ లో నిజంగా మూవీ వస్తే..  భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. వారిద్దరి అద్భుతమైన ప్రతిభ కలిసి, మరో గొప్ప కళాఖండాన్ని సృష్టించగలదని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.