మేకల దొంగలు బాబోయ్.. కాస్ట్లీ కార్లలో వచ్చి కామ్గా ఎత్తుకెళ్తారు.. సంపాదన రూ.50 లక్షలకు పైనే !

మేకల దొంగలు బాబోయ్.. కాస్ట్లీ కార్లలో వచ్చి కామ్గా ఎత్తుకెళ్తారు.. సంపాదన రూ.50 లక్షలకు పైనే !

ఆ మధ్య హైదరాబాద్ లో ఆవుల దొంగలను చూశాం. రాత్రి వేళ్లల్లో ఖరీదైన కార్లలో వచ్చి ఆవులను ఎత్తుకెళ్లడం సంచలనం రేపింది. ఆవులే కాదు.. మేకలు, గొర్రెల దొంగలు కూడా బయలుదేరారు. సేమ్ అదే స్కెచ్.. అదే స్టైల్. రాత్రుల్లో కార్లలో రావడం.. సైలెంట్ గా ఎత్తుకెళ్లడం. మంగళవారం (ఆగస్టు 26) నల్గొండ జిల్లాలో నాలుగు జిల్లలకు చెందిన దొంగల ముఠాను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. 

మేకల దొంగలను అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ప్లాన్ లు.. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, వాహనాలు చూసి షాకయ్యారు పోలీసులు. పట్టుబడిన వారిలో  నాలుగు గ్యాంగ్ లలో మొత్తం 16 మంది  సభ్యులు ఉన్నారు. వీళ్లంతా  26 నేరాలలో 200 లకు పైగా మేకలను దొంగిలించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి వద్ద 2 లక్షల 46 వేల రూపాయల నగదు, 2 లక్షల 75 వేల రూపాయల విలువైన 22 గొర్రెలు, రూ.47 లక్షల విలువై 8 కార్లు స్వాధీనం చేసుకున్నారు. 

గతంలో 30కి పైగా నేరాలలో జైలు జీవితం గడిపినా నిందితుల ప్రవర్తన మారలేదని పోలీసులు అంటున్నారు. శాలిగౌరారం బైరవోనిబండ X రోడ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొంగిలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్నారు. 

 వీరు నాలుగు గ్యాంగ్ లుగా ఏర్పడి  దొంగతనాలు చేస్తున్నారు. సంపంగి వెంకటేష్, వెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  సంపంగి శారద, వారికుప్పల రవి అలియాస్ చింటూ, గండికోట శివ కుమార్ , అమ్ములూరి విజయ్ , వరికుప్పల రాజు , లింగాల అశోక్ , ఉండం కళ్యాణి , కొటేశ్ అలియాస్ లడ్డు , కనుకుల బేబీ అనే ఎనిమిది మంది రెండు గ్యాంగులుగా ఏర్పడి మునుగోడు, గుర్రంపూడు, నిడ్మనూర్, డిండి, కేతేపల్లి, వాడపల్లి, మర్రిగూడ, చింతపల్లి, మల్లెపల్లి, యాచారం, బాలానగర్, సిద్దాపూర్, కడ్తాల్, కొత్తూర్ పోలీస్ స్టేషన్ ల పరిదిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.  

ఇంకో గ్యాంగ్ లో వినోద్, ప్రసాద్, సహదేవ్, కలసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి చిట్యాల, భవనగిరి అన్ని మండలాలలో 26 దొంగతనాలలో దాదాపు 200 మేకలను దొంగతనం చేశారని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS తెలిపారు.