జిల్లాలో లోక్ సభ ఎన్నికల డ్యూటీల తొలిదశ పూర్తి : కలెక్టర్ నారాయణ రెడ్డి 

జిల్లాలో లోక్ సభ ఎన్నికల డ్యూటీల తొలిదశ పూర్తి : కలెక్టర్ నారాయణ రెడ్డి 

వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికలకు జిల్లాలో పోలింగ్ డ్యూటీ చేసే పీఓ, ఏపీఓ, ఓపీఓలు కేటాయింపు తొలిదశ ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఐడీఓసీ ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు కొడంగల్ , పరిగి, తాండూర్, వికారాబాద్ లకు పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు.  మాస్టర్ ట్రైనర్లతో పీఓ, ఏపీఓలకు ట్రైనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్  కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈడీఎం మహమ్మద్ పాల్గొన్నారు.

 రూట్ మ్యాప్ లు చెక్ చేసుకోండి 

లోక్ సభ ఎన్నికల పోలింగ్ డ్యూటీ చేసే రూట్, సెక్టోరియల్ ఆఫీసర్లకు తమ రూట్ మ్యాప్ లను  చెక్ చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. రోడ్లపైనా.. పోలింగ్ కేంద్రాలకు సీరియల్ నంబర్ల వారీగా కేటాయించినట్టు పేర్కొన్నారు. అనంతరం రూట్ మ్యాపులు,  ఎన్నికల పోలింగ్ కేంద్రాల జాబితా అందజేశారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సెక్టోరియల్, రూట్ ఆఫీసర్లు 
పాల్గొన్నారు.