పంటలను పూర్తిస్థాయిలో కొంటాం : కలెక్టర్ అభిలాష అభినవ్

పంటలను పూర్తిస్థాయిలో కొంటాం : కలెక్టర్ అభిలాష అభినవ్
  • కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: జిల్లాలో పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభి లాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పంటల కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో వరి, సో యా, పత్తి, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించి కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధా న్యం, 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం సీసీఐ ద్వారా ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తోందని, 7 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చిన రైతులు తమ వివరాలను మండల వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు చేయించి, పంట ఉత్పత్తి పరిశీలన చేయించుకో వాలన్నా రు. జిల్లాలో మొత్తం 351 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పత్తి రైతుల సౌకర్యార్థం 1800 599 5779 టోల్ ఫ్రీ నెంబరు, 88972 811 11 వాట్సాప్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ సుధాకర్, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, మార్కెటింగ్ అధికారి గజానంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్​కు ఘన స్వాగతం

జల్ సంచయ్ జన్​భాగీదారి కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించి గురువారం కలెక్టరేట్ కు వచ్చిన కలెక్టర్ అభిలాషకు అధికారులు పూలమాలలు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ అన్నారు.