
నిర్మల్, వెలుగు: వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్మల్ జిల్లా ఫ్లడ్ మాన్యువల్–2025 పుస్తకం ఆవిష్కరించారు. గతేడాది జిల్లాలో వరదల తీవ్రత, జరిగిన ఆస్తి, పంట నష్టం సమాచారం ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు.
ఈసారి వానాకాలం నేపథ్యంలో తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, పునరావాస ఏర్పాట్లు వంటి అంశాలున్నాయన్నారు. అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) కిశోర్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేయొద్దు
నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ –2010 నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్హాస్పిటల్స్లో పేషెంట్ల వద్ద నుంచి అధిక చార్జీలు వసూలు చేయొద్దని చెప్పారు. లింగ నిర్ధారణ చేసేవారిపై నిఘా పెట్టాలన్నారు.
దీనిపై సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 7337448722 ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అనంతరం పీసీ అండ్పీఎన్డీటీ చట్టం, అమ్మ రక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎంహెచ్వో రాజేందర్, వైద్యులు పాల్గొన్నారు.