నిర్మల్ లో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్ లో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, వెలుగు: నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. శుక్రవారం నిర్మల్ ​పట్టణంలోని అరుణ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ షాపును తనికీ చేశారు. విత్తనాలు, పురుగు మందుల ప్యాకింగ్, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రెగ్యులర్​గా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

స్పెషల్ ఫోకస్ పెట్టాం

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్​హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజినల్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఉండాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో  ఏఎస్పీ సురేందర్ రావు, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, స్పెషల్ ​బ్రాంచ్ డీఎస్పీ  శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.