మహబూబాబాద్, వెలుగు : అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎడ్యుకేషన్, హెల్త్ న్యూట్రిషన్, శానిటేషన్ ఇతర అంశాలపై ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
జిల్లాలో 1435 అంగన్వాడీ కేంద్రాల్లో ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్, శానిటేషన్ అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా వెల్ఫేర్ అధికారి సబిత, ఆఫీసర్లు శిరీష, ఎల్లమ్మ, నీలోఫర్, కమల, లక్ష్మి, డాక్టర్ ప్రత్యూష, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
