ఖమ్మం జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి : కలెక్టర్ అంకిత్

ఖమ్మం జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి : కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ టేకులపల్లి, వెలుగు : జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ పేర్కొన్నారు. కలెక్టరేట్​లో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్​ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 50 పరిశ్రమలకు దరఖాస్తులు రాగా, 39 సాక్షన్​ చేసినట్టు తెలిపారు. పరిశ్రమల పరంగా జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. 

అనంతరం కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లో హై డెన్సిటీ మిక్స్​డ్​ ప్లాంటేషన్​లో ఎస్పీ రోహిత్​ రాజుతో కలిసి పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డీఎఫ్​వో కిష్టాగౌడ్, సింగరేణి డైరెక్టర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం టేకులపల్లి తహసీల్దార్​ఆఫీస్​ను కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.