విద్యార్థుల్లో రీడింగ్, రైటింగ్ బేసిక్స్​కు ప్రాధాన్యతివ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

విద్యార్థుల్లో రీడింగ్, రైటింగ్ బేసిక్స్​కు ప్రాధాన్యతివ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్కార్ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థుల్లో రీడింగ్,  రైటింగ్ బేసిక్ లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బోధన సామర్థ్యాలను పెంపొందించే దిశగా నాంపల్లిలోని అలియా మోడల్ స్కూల్లో ప్రభుత్వ​ఉపాధ్యాయులకు గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ప్రతి స్టూడెంట్ చదవగలిగేలా టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చదవడం రాని పిల్లలు తమ స్కూళ్లలో లేరని డిక్లేర్ చేయాలన్నారు. ఇలాంటి సదస్సుల  ద్వారా విద్యా ప్రమాణాల అంశాలపై చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు. డీఈఓ ఆర్. రోహిణి, డైట్ ప్రిన్సిపాల్ రవి కాంత్ రావు, ఎస్ఆర్పీలు నాగరాజు, బాలు పాల్గొన్నారు.