గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేయాలి : అనురాగ్ జయంతి

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు  ఏర్పాట్లు చేయాలి : అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: వచ్చే నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ లో  వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగనుందన్నారు. ఈ పరీక్షకు జిల్లాలో 4,699 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వీరి కోసం జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  సమావేశంలో  ఆర్సీవో శ్రీనివాస్, డీఐఈవో మోహన్, డీఈవో రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీటీవో డీటీఓ లక్ష్మణ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

తంగళ్లపల్లి, వెలుగు:  అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి, నేరెళ్ల, ముస్తాబాద్ మండలం పోత్గల్, చీకోడు జడ్పీ హైస్కూళ్లలో జరుగుతున్న పనులను అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా యూనిఫామ్స్ విద్యార్థులకు అందజేయాలన్నారు.