చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఇక్కత్ చీరల ప్రత్యేకతను చాటుతూ, వాటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి హామీ ఇచ్చారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో రూర్బన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన మహిళా ఇక్కత్ హస్తకళా సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు.
సభ్యుల సమస్యలు, ఉత్పత్తి విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక డిజైన్లు, నాణ్యతను పెంచడం ద్వారా ఇక్కత్ ఉత్పత్తులకు స్థిరమైన బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించాలని, ఆన్‌లైన్, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులను అవలంబించాలని సూచించారు. సొసైటీ కోరిన విధంగా అదనపు షెడ్డు, బోర్ మోటార్ సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
