గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు:  గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఎస్పీ రాజేశ్​చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఆర్డీవో వీణలతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు.

 జిల్లా కేంద్రంలో శోభాయాత్ర మార్గం నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 700కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉన్నందున రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువు లోపలకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, కరెంటు వైర్లను పైకి ఎత్తాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్‌‌ పాల్గొన్నారు.

వరద బాధితులకు నిత్యావసరాలు

జిల్లా కేంద్రం, రాజంపేటలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మంగళవారం జీఆర్ కాలనీలో సహాయక చర్యలను పరిశీలించారు. దుప్పట్లు, బట్టలు, బియ్యం, పప్పులు తదితరవి పంపిణీ 
చేస్తామని చెప్పారు. ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్  ఉన్నారు.