మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

మిల్లర్లు బ్యాంక్​ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రస్తుత 2024–-25 సంవత్సరం కస్టమ్​మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్) కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జినులతో సమావేశం నిర్వహించారు. ల్లాలోని రైస్ మిల్లుల యజమాఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ ఏడాది  సీఎంఆర్ కోసం రైసు మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరుగుతున్న దృష్ట్యా మిల్లర్లు గ్యారంటీ, అగ్రిమెంట్లు అందజేయాలన్నారు.  

2021–-22, 2022–-23 సంవత్సరాలకు సంబంధించిన పెండింగులో ఉన్న సీఎంఆర్​ వెంటనే సరఫరా చేయాలని, డిఫాల్ట్ అయిన మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.