ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాదావత్ సంతోష్‌‌‌‌‌‌‌‌

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాదావత్ సంతోష్‌‌‌‌‌‌‌‌
  • వార్డు ఆఫీసర్లపై కలెక్టర్ ఆగ్రహం 

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాదావత్ సంతోష్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై వార్డు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల ఆలస్యంపై సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్లు, పట్టణ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమన్వయం చేసుకొని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యాపార సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, వాణిజ్య సంస్థల యాజమాన్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

లింగాల, వెలుగు: భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం లింగాల మండల తహసీల్దార్ ఆఫీసును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో స్వీకరించిన భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. మండల వ్యాప్తంగా 652 దరఖాస్తులు రాగా అందులో 82 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించడంపై తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని పరిశీలించారు. అనంతరం లింగాల మండల కేంద్రంలోని సీహెచ్‌‌‌‌‌‌‌‌సీని తనిఖీ చేశారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చే గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.