తెల్కపల్లి మండలంలో వంతెన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

తెల్కపల్లి మండలంలో వంతెన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి :  కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వంతెన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం తెల్కపల్లి మండలం రామగిరి, రఘుపతిపేట గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వర్షాలు కొనసాగుతున్న సమయంలో భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగే ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వద్ద ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అధికార యంత్రం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. 

అనంతరం తెల్కపల్లి మండల కార్వంగ జడ్పీ హైస్కూల్​ను కలెక్టర్​ సందర్వించారు. విద్యార్థుల చదువును పరిశీలించేందుకు ఉపాధ్యాయుడిగా మారి తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు గణితం సులభంగా అర్థమయ్యేలా నేర్పించారు. ఉపాధ్యాయులు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను, తరగతి గదుల పైకప్పును లీకేజీని పరిశీలించారు. మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఎంఈవో శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో విద్యపై సమీక్షించారు.