ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తాం : బదావత్ సంతోష్

ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తాం : బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు గుణాత్మక విద్యను అందించే దేవాలయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించి, మంచి ఫలితాల సాధన దిశగా కృషి చేస్తామన్నారు.

జిల్లాలో అంగన్వాడీ విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రతి 15 రోజులకు సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి, అవసరమైన చర్యలు చేపడుతమని తెలిపారు. విద్యా వాలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, అదనపు సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో బియ్యం, సరుకులు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాధికారి యాదయ్య, లక్షెట్టిపేట, దండేపల్లి మండల విద్యాధికారి నరేందర్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం నాయకులు హన్మండ్లు, స్కూళ్ల హెచ్​ఎంలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.