
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భారతి హోళీకేరి అధికారులకు సూచించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డీఆర్సీ సెంటర్లను గురువారం ఆమె పరిశీలించారు. అక్కడికి ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీ, ఇతర వసతుల గురించి స్థానిక అధికారులను ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట రిపేర్లు చేపట్టాలన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్రివర్సిటీలోని పోలింగ్ స్టేషన్ను ఆమె పరిశీలించారు. కలెక్టర్ వెంట రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్ రెడ్డి, ఏసీపీ గంగాధర్, తహసీల్దార్ వేణు గోపాల్, అధికారులు ఉన్నారు.