తాడ్వాయి, వెలుగు : మేడారం వనదేవతల దేవాలయ గద్దెల ప్రాంగణంలో రాతి స్తంభాల నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సంబంధిత గుత్తేదారులను, అధికారులను కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. సోమవారం మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న రాతి స్తంభాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్కిటెక్చర్ శివ నాగిరెడ్డి, దేవతల గద్దెల ప్రాంగణంలో నిర్మిస్తున్న రాతి స్తంభాల పై భాగంలో అమర్చబడే రాతి, చిహ్నాల వివరాలను కలెక్టర్ కు వివరించారు. మహా జాతర సమీపిస్తుండడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
