
ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారంలో ఈ నెల 22 నుంచి 30 వరకు నిర్వహించే మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిరం పోస్టర్ ను ములుగు కలెక్టర్ దివాకర్ కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించారు. మండలంలోని రోహీర్ గ్రామానికి చెందిన సినీ యాక్టర్ సంజోష్ స్థాపించిన సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపేంద్ర రాచుపల్లి, శిల్పా సహకారంతో ఏటూరునాగారం గిరిజన్ భవన్ వద్ద సంజోష్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్వో గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.