బోయినిపల్లి,వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం బోయినిపల్లి మండలం కొదురుపాకలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, జగ్గరావుపల్లిలోని సుహాస్ రైస్ మిల్లును తనిఖీ చేశారు.
వడ్ల కొనుగోలు వివరాలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తికాగానే లారీలను తెప్పించి వడ్లు తరలించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రైతులకు వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట డీఎస్‌వో ఎల్.బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీసీవో రామకృష్ణ, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ షరీఫోద్దీన్ తదితరులు ఉన్నారు.
