మహిళాభివృద్ధికి పెద్దపీట : కలెక్టర్ హైమావతి

మహిళాభివృద్ధికి పెద్దపీట : కలెక్టర్ హైమావతి
  •     కలెక్టర్​ హైమావతి

సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కలెక్టర్​హైమావతి అన్నారు. మంగళవారం ఆమె దుబ్బాకలోని ఐఓసీ లో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని మహిళలకు ఏఎంసీ చైర్మన్ కొంగర రవితో కలిసి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని స్వయం సహాయక గ్రూపు మహిళలకు రూ.1. 26 కోట్ల  వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. 

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ మహిళ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, అడిషనల్ డీఆర్డీఓ సుధీర్, మెప్మా పీడీ హనుమంత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్, తహసీల్దార్ సంజీవ్ కుమార్, ఎంపీడీవో భాస్కర శర్మ, మెప్మా సీవో రేణుక, ఆర్పీలు, ఎస్ హెచ్ జీ లు పాల్గొన్నారు. 

 కలెక్టర్​ సమక్షంలో చెక్కుల పంపిణీ

చేర్యాల: చేర్యాల పట్టణంలోని కల్యాణి గార్డెన్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా కలెక్టర్​హైమావతి మహిళలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ చేర్యాల పట్టణంలోని 49 స్వయం సహాయక సంఘాలకు రూ. 10,05,977 ల చెక్కును అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్​ చైర్ పర్సన్​ శ్వేత వెంకటాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 గజ్వేల్ ఐఓసీలో ఇందిరా మహిళ శక్తి సంబరాలు

గజ్వేల్: ప్రభుత్వ పథకాలు మహిళా ప్రాధాన్యమే లక్ష్యంగా అమలవుతున్నాయని కలెక్టర్​ హైమావతి అన్నారు. గజ్వేల్​ పట్టణంలోని ఐవోసీలో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. జిల్లాలో రైతు భరోసా కింద రూ.390 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ జయదేవ్ ఆర్య, ఏఏంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకిషన్, తహసీల్దార్ శ్రావణ్ పాల్గొన్నారు.

అనంతరం ప్రజ్ఞాపూర్​స్కూల్​ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నభోజనం నాణ్యతను పరిరశీలించారు. విద్యార్థుల చదువు, భోజనం విషయంలో రాజీ పడొద్దని హెచ్​ఎంకు సూచించారు.