
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- కలెక్టర్ హైమావతి
గజ్వేల్, వెలుగు: వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ సాగర్ నుంచి దౌలతాబాద్ వెళ్తున్న కెనాల్ గజ్వేల్ మండలం దిలాల్ పూర్ గ్రామ వద్ద తెగిపోయిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు.
నీటి ఉధృతి తగ్గేలా రైతులకు ఎక్కువ డామేజ్ కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ శ్రావణ్, ఉన్నారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
ములుగు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్హైమావతి సూచించారు. మంగళవారం ములుగు పీహెచ్సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్చేశారు. సెలవులు లిస్టును రిజిస్టర్లో నమోదు చేయాలని మెడికల్ ఆఫీసర్ దీప్తికి చెప్పారు. గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.
అనంతరం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీలోని రైతు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల గురించి తెలుసుకున్నారు. దేశీ రకం వంగడాలతో కూడిన నర్సరీలను పెంచాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఏవో స్వరూప రాణి, డీహెచ్వో సువర్ణ ఉన్నారు.